ETV Bharat / crime

DIED: జగనన్న కాలనీ నిర్మాణ పనుల్లో విషాదం.. విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రీ మృతి

DIED: జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల్లో విద్యుత్ తీగలు తగిలి పాము రమణ అనే తాపీ మేస్త్రీ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జరిగింది.

electric shock
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : May 24, 2022, 3:37 PM IST

DIED: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణ పనులను చేపడుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి కొండపాలెం గ్రామానికి చెందిన పాము రమణ అనే తాపీమేస్త్రీ మృత్యువాత పడ్డాడు. తాపీమేస్త్రీ మృత్యువాత పడటంతో అతని భార్య లక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రోలుగుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మండలంలోని కొండపాలెం గ్రామానికి చెందిన సుమారు 57 మంది లబ్ధిదారుల కోసం ఇక్కడ స్థలాలను కేటాయించారు. కొద్ది రోజుల క్రితమే స్ధానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ, అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున తదితరులు అట్టహాసంగా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ స్థలాలపై నుంచి కొమరవోలు వరకు విద్యుత్ స్తంభాలు మార్చి తీగలు సవరించాలి. తీగలు సవరించేందుకు ట్రాన్స్​కో అధికారులు మార్చి నెలలో సుమారు 23 వేల 901 రూపాయలు చెల్లించాలని సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ అధికారులు జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ హౌసింగ్ అధికారులు స్పందించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.