Man died with kite manja: పండగ పూట విషాదం చోటుచేసుకుంది. పతంగుల పండుగగా పిలుచుకునే సంక్రాంతి రోజు.. ఆ గాలిపటం కారణంగానే ఓ నిండు ప్రాణం బలైంది. గాలిపటాన్ని ఎగరేసేందుకు వినియోగించిన మంజా దారమే ఓ వ్యక్తికి మృత్యుపాశమై బిగుసుకుని తిరిగిరానిలోకాలకు పంపించేసింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో జరిగింది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన భీమయ్య బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా మంచిర్యాలకు వచ్చి.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాలికి గాయమైందని భార్యతో కలిసి ద్విచక్రవాహనం మీద పట్టణంలోని వైద్యుని వద్దకు వెళ్లారు. వైద్యం చేయించుకుని తిరిగి వస్తుండగా.. పాత మంచిర్యాల రాళ్లవాగు వంతెన సమీపంలో ఎగురుతున్న గాలిపటం మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకొని ఒక్కసారిగా కిందపడిపోయాడు.
భీమయ్య గొంతు కోసుకుపోయి.. తీవ్ర రక్తస్రావమైంది. భర్త గొంతు తెగటాన్ని చూసిన భార్య ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపించింది. రక్తం చాలా పోవటంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: