ETV Bharat / crime

450 కిలోల గంజాయి పట్టివేత.. విలువ ఎంతో తెలిస్తే షాకే!

తెలంగాణ మేడ్చల్ జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి(cannabis seized in medchal) తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ganja seize
గంజాయి సీజ్​
author img

By

Published : Nov 11, 2021, 9:10 AM IST

Updated : Nov 11, 2021, 10:40 AM IST

తెలంగాణ మేడ్చల్ జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి(cannabis seized in medchal) పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న 450 కిలోల గంజాయి(450 kilograms of cannabis seized in medchal)ని ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గంజాయి(cannabis seized in medchal) తరలిస్తున్న నలుగురిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.

రాష్ట్రంలో గంజాయిని(cannabis prevention measures) కట్టడి చేయడంపై గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని... రైతు బంధు, బీమా వంటివి నిలిపేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో గంజాయి కట్టడికి రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ఎక్కడికక్కడే గాంజా తరలింపును అడ్డుకున్నారు. గంజాయి సాగును నిర్వీర్యం చేశారు.

కొద్దిరోజులుగా గంజాయి తరలింపు కేసులు తగ్గుముఖం పట్టాయనుకునేలోగానే మేడ్చల్ జిల్లాలో భారీగా సరుకు పట్టుబడింది. పోలీసులు పట్టుకుంటారనే భయం లేకుండా ద్విచక్రవాహనాల్లో గంజాయిని తరలించారు. ఈ కేసులో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. గంజాయి వాడకం(marijuana usage) అనేక అనర్థాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో ఆందోళన, గుండె దడ, గుండెపోటు, మానసిక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. దీర్ఘకాలం గంజాయి తీసుకుంటే కానబనాయిడ్‌ హైపరమెసిస్‌ సిండ్రోమ్‌ (సీహెచ్‌ఎస్‌) అనే రుగ్మతతో బాధపడతారని తెలిపారు. పదే పదే వికారం కలుగుతూ వాంతులవుతాయన్నారు. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుందని హెచ్చరించారు.

ఒకటి రెండు వారాలు గంజాయి(marijuana damages health) తీసుకుని ఆపేసిన వారిలోనూ భయం, వణుకు, నిద్రలేమి, ఆకలి తగ్గడం, చెమటలు పట్టడం, మానసిక పరిస్థితి సవ్యంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ద్రవ, స్ప్రే రూపంలో గంజాయి తీసుకుంటే- తలనొప్పి, మగత, పొడినోరు, వికారం, మతిస్థిమితం దెబ్బతినడం వంటివి తలెత్తుతాయని చెబుతున్నారు. గంజాయిని పొగ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి : Ap Genco: ఆర్థిక గండం గట్టెక్కడానికి.. అన్ని వేల కోట్లు కావాలా?!

Last Updated : Nov 11, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.