ETV Bharat / crime

Cyber Crime: ఇంట్లోనే కూర్చోని.. రోజుకు 10 వేల వరకు సంపాదించుకోండి! - సైబర్​ క్రైమ్​ తాజా వార్తలు

ఇంట్లోనే కూర్చోని.. రోజుకు 3 నుంచి 10 వేలు సంపాదించుకోండి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో పార్ట్‌టైం ఉద్యోగాలు.. కొంత పెట్టుబడికి అధికలాభాలు పొందండి. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఇలాంటి ప్రకటనలు చూసి ముందడుగు వేశారా!!.. ఇక అంతే!!!.. మీ ఇల్లు గుల్ల చేస్తారు. సైబర్‌ మాయాజాలంతో అప్పుల ఊబిలో ముంచుతారు. హైదరాబాద్‌లో ఇటీవల ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు.

investment
investment
author img

By

Published : Aug 25, 2021, 7:55 AM IST

తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి. అదీ సులభంగా డబ్బు ఖాతాలోకి రావాలి. ఇలా ఆశపడేవారే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. అధిక మొత్తంలో లాభాలంటూ.. ఆకర్షణీయ ప్రకటనలతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. గృహిణులు, విద్యావంతులు లక్ష్యంగా మోసాలు చేస్తున్నారు. అమెజాన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం.. రోజుకు 10వేలకు సంపాదన అంటూ వచ్చిన సందేశానికి స్పందించిన చందానగర్‌కు చెందిన ఓ యువకుడు 2లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలంటూ.. హెచ్​పీజడ్​యాప్‌లో పెట్టుబడులు పెట్టిన సుచిత్రవాసి.. 6లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. షాపింగ్‌ చేస్తే కమీషన్లు వస్తాయంటూ వచ్చిన ప్రకటనతో.. రాజేంద్రనగర్‌కు చెందిన మహిళ రెండున్నర లక్షలు బూడిదపాలు చేసుకుంది.

చివరికి పోలీసుల వద్దకు

షాప్‌ నౌ అనే యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న మహిళ నగదు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల హైదరాబాద్​ జంటనగరాల పరిధిలో ఈ తరహా కేసులు అధికమయ్యాయి. ఉన్నత చదువులు చదివిన వారూ సైబర్‌ వలలో చిక్కుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మొదట తక్కువ పెట్టుబడికి లాభాలు ఇవ్వడంతో లక్షల్లో జమ చేస్తూ మోసపోతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. సులభంగా డబ్బు వస్తోందంటే అది మోసంగానే గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.

ఇదీ చదవండి: sc commission at guntur : రమ్య కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడికి కఠిన శిక్ష ఖాయం: జాతీయ ఎస్సీ కమిషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.