విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నేపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాములయ్య (17) అనే విద్యార్ధి నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. బుధవారం గ్రామంలోని తన తాతయ్య పాన్ దుకాణాన్ని మరోచోటుకు తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఫ్రిజ్ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాములయ్య మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: