IIIT Student Died: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరుకు చెందిన నికేష్ రెండు సంవత్సరాల క్రితం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరాడు. వేసవి సెలవులకు వెళ్లి తిరిగి వచ్చిన నికేష్ వసతి గృహంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి వసతి గృహ పర్యవేక్షకులకు తెలియజేశారు. వారు ఆ విద్యార్థిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. దీనిపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: