కర్నూలు జిల్లా నందవరం మండలం పోనకలదిన్నె గ్రామానికి చెందిన రాధకు.. దేవనకొండ మండలం కుక్కటికొండ గ్రామానికి చెందిన సుధాకర్‌తో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని రోజులుగా రెండో వివాహం చేసుకుంటానని భార్యను వేధిస్తున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులపై గతంలో అతనికి పోలీసులతో కౌన్సెలింగ్ చేయించామని మృతురాలి తండ్రి చెబుతున్నారు. భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రాధ ఆదివారం పురుగుల మందు తాగింది.. చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందింది.
ఇదీ చదవండి: ఒంటరిగా ప్రయాణించినా.. మాస్కు తప్పనిసరి'