ETV Bharat / crime

సీపీఎస్‌ రద్దు కోరుతూ హెచ్‌ఎం ఆత్మహత్యాయత్నం - సీపీఎస్‌ రద్దు

HEAD MASTER SUICIDE ATTEMPT FOR CPS : జగన్​ ముఖ్యమంత్రి అయ్యాక సీపీఎస్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు దానిని అమలుచేయడం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. తన మరణానికి ప్రభుత్వమే కారణమంటూ ఓ లేఖ రాసి నిద్రమాత్రలు మింగాడు.

HEAD MASTER SUICIDE ATTEMPT
HEAD MASTER SUICIDE ATTEMPT
author img

By

Published : Nov 18, 2022, 7:58 PM IST

HM SUICIDE ATTEMPT FOR CPS : సీపీఎస్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక దానిని నెరవేర్చలేదంటూ.. ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన.. నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం అలెబాద్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చెన్నప్ప.. ఆత్మహత్యకు యత్నించారు. తన మరణానికి ప్రభుత్వమే కారణమంటూ లేఖ రాసి దానిని వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశారు. అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. దీన్ని చూసిన తోటి ఉపాధ్యాయులు వెంటనే చెన్నప్ప ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. అనంతరం వెంటనే చెన్నప్పను బనగానపల్లె ఆసుపత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.