ETV Bharat / crime

ఈ గోల్డ్ స్మగ్లింగ్ చూశారంటే.. ఆ సినిమా గుర్తొస్తుంది..!

Gold Smuggling in Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. దుబాయ్ చూడాలనే ఆసక్తి ఉన్నవాళ్లే ఆ ముఠాకు స్మగుల్​ గూడ్స్​. ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ దందా.. ఓ యువకుడు ఆ ముఠాను మోసం చేయటం వల్ల మొత్తం బయటపడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్నారంటే.. ఫేమస్ సినిమా గుర్తొస్తుంది.

Gold Smuggling in Hyderabad
Gold Smuggling in Hyderabad
author img

By

Published : Jun 24, 2022, 1:48 PM IST

Gold Smuggling in Hyderabad: నటుడు సూర్య నటించిన.. "వీడొక్కడే" సినిమా తరహాలో జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఆ సినిమాలో ఓ గ్యాంగ్​.. కొంతమందిని ఎంచుకుని విదేశాలకు పర్యాటకులుగా పంపిస్తుంది. అయితే.. వారితో పాటు పలువిధాలుగా డ్రగ్స్​, బంగారం, డైమండ్స్​ లాంటివాటిని స్మగ్లింగ్​ చేయిస్తుంది. అచ్చం అలాంటి దందానే.. ఒకటి హైదరాబాద్​లోనూ వెలుగుచూసింది.

ఈ హైదరాబాద్​ గ్యాంగ్​ కూడా బంగారం స్మగ్లింగ్​ చేయించేందుకు.. దుబాయ్​ చూడాలన్న ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసుకుంటుంది. ఇలా.. కొంతమందిని ఎంచుకుని పర్యాటక వీసాపై సొంత ఖర్చులతో దుబాయ్‌కి పంపుతున్నారు. కేవలం పంపటమే కాదు.. దుబాయ్‌ నుంచి హైదరాబాద్​కు తిరిగి వచ్చేటప్పుడు అక్రమ బంగారం అప్పజెప్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా హైదరాబాద్‌కు బంగారం తీసుకువస్తే డబ్బు ఇస్తామని ఆశ చూపుతున్నారు. వారి ఆఫర్​కు ఆకర్షితులవుతున్న కొందరు యువకులు స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి కొందరు.. క్షేమంగా ఇంటికి చేరితే.. మరికొందరు పోలీసులకు దొరికి కటకటాలపాలవుతున్నారు.

ఇలా.. ఆకర్షితులైన సనత్‌నగర్​కు చెందిన షెహబాజ్, అయాజ్, ఫహద్‌ను స్మగ్లర్లు 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపారు. ప్లాన్​లో భాగంగా.. షెహబాజ్, అయాజ్ కలిసి అక్రమ బంగారాన్ని ఎవరికీ దొరకకుండా హైదరాబాద్‌కు తెచ్చారు. ఫహద్​ మాత్రం.. నగరానికి తిరిగిరాకుండా దుబాయ్‌లోనే తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఠా.. ఫహద్ ఆచూకీ కోసం అతడి తండ్రిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం.. షెహబాజ్, అయాజ్, అసిమ్‌ను కూడా కిడ్నాప్ చేశారు. ఫహద్​ ఆచూకీ చెప్పాలంటూ.. శాస్త్రిపురంలోని ఓ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు.

బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురై.. పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఇన్ని రోజులు గుట్టుగా సాగిన స్మగ్లింగ్‌ దందా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్మగ్లింగ్​ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ ముఠా పట్టుబడితే.. ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది..? ఇప్పటివరకు ఎంత బంగారం స్మగ్లింగ్​ చేశారు..? ఇందులో ఎవరెవరు భాగస్వామ్యులయ్యారు..? ఒక బంగారమేనా.. డ్రగ్స్​ లాంటివి కూడా స్మగ్లింగ్​ చేస్తున్నారా..? అన్న అంశాలపై స్పష్టత రానుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.