Road Accident: తెలంగాణలోని హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై వనపర్తి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరకు ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 15మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్ని హుటాహుటిన వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో ప్రయాణీకుడు మృత్యువాత పడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. చెరకు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి, హైవే సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
ఇవీ చదవండి :