ETV Bharat / crime

విజయవాడ గ్యాంగ్​ రేప్​ కేసు.. ఇద్దరు అరెస్ట్​ - Raped in Sanat Nagar for three days

Gang Rape in penamaluru: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లండించారు. తెలిసిన వారే మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో నిర్థారించామన్నారు.

SP Joshua
తెలిసిన వారే అత్యాచారం
author img

By

Published : Dec 20, 2022, 8:46 PM IST

Gang Rape in penamaluru: విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మీడియాకు వివరించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మీడియా సమావేశం

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద బాలకోటి అనే వ్యక్తితో గత సంవత్సరం కాలంగా సహజీవనం సాగిస్తోంది. ఆమెకు పరిచయం ఉన్న శ్రీను అనే నిందితుడితో రెండు రోజుల పాటు పనికి వెళ్లింది. శ్రీనుతో పాటు నాగరాజు, రవి అనే మరో ఇద్దరూ వ్యక్తులు మార్గమాధ్యలో కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు సనత్ నగర్‌లోని ఓ ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశారు.-జాషువా, కృష్ణా జిల్లా ఎస్పీ

మహిళా అనారోగ్యంగా ఉండడంతో బాలకోటి ఆమెను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వైద్యుల సమాచారంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్టు చేశారని, నిందితుల్లో ఒకడైన రవి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ జాషువా తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.