ETV Bharat / crime

Case On Bellamkonda: హీరో బెల్లంకొండ శ్రీనివాస్​పై చీటింగ్​ కేసు.. - నిర్మాత బెల్లంకొండ సురేష్​పై చీటింగ్​ కేసు

Case On Bellamkonda: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్​తోపాటు ఆయన తనయుడు, సినీహీరో బెల్లంకొండ శ్రీనివాస్​పై కేసు నమోదైంది. తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని.. ఓ ఫైనాన్షియర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్​ కేసు నమోదు చేశారు.

Bellamkonda
Bellamkonda
author img

By

Published : Mar 11, 2022, 8:51 PM IST

Case On Bellamkonda: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్​పై తెలంగాణలోని బంజారాహిల్స్ సీసీఎస్​లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేష్​, శ్రీనివాస్​ తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని శ్రవణ్​కుమార్​ అనే వ్యాపారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు.

2018లో డైరెక్టర్​ మలినేని గోపిచంద్​ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు డబ్బులు అవసరముందని దాదాపు రూ.85 లక్షలు తీసుకున్నారని శ్రవణ్​ తెలిపారు. తీసుకున్న డబ్బులు అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదన్నాడు. ఇవ్వమని అడిగితే.. ఆ సినిమాకు సహనిర్మాతగా లాభాల్లో వాటా కల్పిస్తామని నమ్మబలికారన్నారు. ఇప్పటికీ ఆ సినిమా తెరకెక్కకపోవటం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటం వల్ల నాంపల్లి కోర్టులో శ్రవణ్​ దావా వేశాడు. బాధితుని పిటిషన్​ను పరిశీలించిన కోర్టు.. బెల్లంకొండ సురేష్​, శ్రీనివాస్​పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలమ మేరకు.. పలు సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం.. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా..​ ఛత్రపతి సినిమానులో బాలీవుడ్​లో రీమేక్​ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్​ డైరెక్టర్​ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా.. పెన్​ స్టూడియోస్​ నిర్మిస్తోంది. దీంతో పాటు.. టైగర్​ నాగేశ్వరరావు ఆత్మకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న 'స్టువర్టుపురం దొంగ' సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బెల్లకొండ సురేష్​ నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: 'స్టూవర్ట్​పురం దొంగ'గా బెల్లంకొండ శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.