ETV Bharat / crime

'నాన్న... అమ్మ ఎక్కడ' అన్నందుకు ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి - ఏపీ క్రైం న్యూస్

Father killed daughter in Mahbubnagar: చిన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే భద్రంగా ఉంటారు. అందులోనూ తండ్రి మరింత భద్రంగా పిల్లలను చూసుకుంటాడు. అలాంటి తండ్రే దారుణానికి ఒడికట్టాడు. చిన్నారి నాన్న, నాన్న అమ్మ ఎక్కడ అని పలుమార్లు అడిగినందుకు తండ్రికి విసుగు వచ్చి ముక్కు, నోరు మూసి చంపేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంమహబూబ్​నగర్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 6, 2023, 7:52 PM IST

Father killed daughter in Mahbubnagar: అమ్మ కావాలని ఏడిస్తే.. ఇంటికి రప్పిస్తాడనుకుంది.. తన దగ్గరకు వస్తున్న నాన్నను చూసి.. బుజ్జగిస్తాడనుకుంది. కానీ, ఏకంగా తన ప్రాణం తీస్తాడని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. భార్యపై కోపంతో ఆరేళ్ల కుమార్తెను స్వయంగా కన్నతండ్రి హతమార్చిన అమానవీయ ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్​నగర్ పరిధిలోని పాలకొండ తండాకు చెందిన శివకు, అదే తండాకు చెందిన శోభతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

కూలీ పనిచేసే శివ మద్యానికి బానిసయ్యి భార్యను కొట్టి వేధించేవాడు. ఇది భరించలేక పది రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలతో అదే తండాలోని పుట్టింటికి వెళ్లింది. కాగా .. పెద్ద కుమార్తె కీర్తన(6) తండ్రితోనే ఉంటోంది. బుధవారం రాత్రి అమ్మ కావాలని ఆ చిన్నారి ఏడవటంతో కోపంతో ఆమె ముక్కు, నోరు మూశాడు. ఊపిరాడక చిన్నారి గిలగిలా కొట్టుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అర్ధరాత్రి చిన్నారిని తండ్రి, తాత మహబూబ్​నగర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని చెప్పారు.

ముందుగా పాముకాటుతో చనిపోయిందని, ఆ తర్వాత ఆకలితో చనిపోయిందని శివ చెప్పడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో చిన్నారిని హత్య చేసినట్టు తండ్రి శివ ఒప్పుకున్నాడు.

" నాన్న అమ్మ ఎక్కడ" అని అడిగిందని కూతురిని చంపిన తండ్రి

"రోజు గంజాయ్ తాగి వచ్చి నన్ను కొట్టేవాడు. దెబ్బలకు భయపడి మా ఇంటికి వచ్చేశాను. పిల్లల విషయంలో గొడవ అయింది. దీంతో పోలీసులకి ఫిర్యాదు చేశాను. పోలీసులు వచ్చి పిల్లలని తీసుకెళ్లమన్నారు. పెద్ద అమ్మాయి మాత్రం రాలేదు. పది రోజుల తరవాత పాపని చంపేశాడు. ఎలా చనిపోయిందని అడిగితే మెుదట పాముకాటుకి చనిపోయిందన్నాడు. గట్టిగా అడిగితే తానే చంపానని ఒప్పుకున్నాడు." - శోభ, చిన్నారి తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.