మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో కలహాలతో ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి, అక్షిత దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి.. కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ చేరుకున్నారు. నాగారం మున్సిపాలిటీ.. వెస్ట్‌గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు.
శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు.... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :