తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రిలో... తెరాస నేత ఈటల రాజేందర్ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో.. ఈటలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ... మందమర్రి అంగడి బజార్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ ముదిరాజ్ ఈ పని చేశాడు. వెంకటేశ్‌కు మొదటి నుంచి ఈటల రాజేందర్ అంటే ఎనలేని అభిమానం. ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించేవాడు.
హైదరాబాద్‌లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసే వెంకటేశ్ రెండు రోజుల క్రితం మందమర్రికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకు చేరి తన నిరసన తెలిపాడు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: