ETV Bharat / crime

FAKE BABA: చదవకున్నా ఈ బాబా పూజలు చేస్తే.. - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

మీరు పరీక్షలో పాస్‌ కావాలంటే ఏం చేస్తారు..? కష్టపడి చదువుతారు. కానీ.. ఓ ఎంబీబీఎస్‌ పట్టభద్రురాలు ఏం చేసిందో తెలుసా..? ఓ స్వామిజీని నమ్ముకుంది. పూజలు చేస్తే చాలూ.. పాస్‌ అయిపోతావని ఆ కేటుగాడు చెప్పిన మాటలను నమ్మి రూ.80 వేలు సమర్పించుకుంది. తర్వాత రెండు సార్లు ఫెయిల్‌ కావడంతో లబోదిబోమంటూ సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై హైదరాబాద్ గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది.

educated woman approach fake baba
పూజలు చేస్తే చాలూ.. ఎంబీబీఎస్​ పాస్‌
author img

By

Published : Sep 6, 2021, 4:51 PM IST

విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన పట్టభద్రులు మన దగ్గర ప్రాక్టీస్‌ చేయాలంటే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌) పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పశ్చిమబెంగాల్‌కు చెందిన మహిళ(41) ప్రస్తుతం హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటోంది. 2011లో విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని స్వదేశానికొచ్చింది. పలుమార్లు ఎఫ్‌ఎంజీఈ పరీక్షలకు హాజరైనా ఉత్తీర్ణత కాలేదు.

ఈ క్రమంలోనే బాధితురాలి సోదరికి ఓరోజు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ కనిపించింది. ‘బిస్వజిత్‌ ఝా’ అనే స్వామిజీ పూజ చేస్తే చాలూ.. ఎలాంటి పరీక్షయినా తేలిగ్గా గట్టెక్కొచ్చని అందులో ఉంది. వెంటనే ఆమె ఆ స్వామిజీ ఫేస్‌బుక్‌ ఖాతాను వెతికి పట్టుకుని.. మెసేజ్‌ పెట్టింది. అటువైపు నుంచి వెంటనే స్పందన వచ్చింది. తన సోదరి పడుతున్న ఇబ్బంది గురించి వివరించింది. జాతక దోషాలున్నాయని.. అందుకే ఇలా జరుగుతుందంటూ స్వామిజీ ఆమెకు వివరించాడు. ఆమెకు నమ్మకం కుదరడంతో తన సోదరి నంబర్‌ స్వామీజికి ఇచ్చింది.

గచ్చిబౌలి సీఐ సురేశ్​

ఎక్కడో లోపమంటూ రెండోసారి..

స్వామీజీ శిష్యులు బాధితురాలిని సంప్రందించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆమె హాల్‌ టికెట్‌ ఫొటో తీసి వాట్సాప్‌లో పంపించింది. పూజ చేయాలంటే కొంత ఖర్చవుతుందని నమ్మించారు. ఆమె రూ.21,500 ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షలో పాస్‌ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామిజీని అడిగింది. ఎక్కడో పూజలో లోపం జరిగిందంటూ నమ్మబలికాడు.

కాలభైరవ ప్రత్యేక పూజ’ చేద్దామంటూ ప్రతిపాదించాడు. ఇది చేస్తే ‘పాస్‌’ కావడం కాదు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తావంటూ నమ్మించాడు. అందుకు ఆమె అంగీకరించి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపించింది. ఈ ఏడాది కూడా ఆమె పాస్‌ కాలేదు. ఎందుకిలా జరిగిందంటూ అడిగితే అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించింది. ఈ స్వామీజీ వలకు పదుల సంఖ్యలో ఉన్నత విద్యావంతులు చిక్కినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కేటుగాడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

ఎంత విదేశాల్లో చదువుకున్నా ఏం లాభం. ఏది మోసమో... ఏది మూఢఛారమో తెలుసుకోలేని అమాయకత్వం. చదువు జ్ఞానాన్ని పెంచాలే కానీ... చదువు కోసం అజ్ఞానంలోకి జారిపోయింది ఈ విద్యావంతురాలు. కనీసం మొదటి సారి పాస్​ కాకపోయినా... తను చేస్తున్న విషయాన్ని గ్రహించి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సింది. డబ్బులు అయినా మిగిలేవి.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేది. ఇప్పటికైనా విద్యావంతులు ఇలాంటి మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటే మంచిది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.