ETV Bharat / crime

హత్య కేసును ఛేదించిన పోలీసులు..వివాహేతర సంబంధమే కారణం

author img

By

Published : Apr 13, 2021, 9:37 PM IST

ఈ నెల 10న జరిగిన హత్య కేసులో గుంటూరు జిల్లా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం ఉప్పరపాలెంలో జరిగిన నేరంపై తాడిశెట్టి సింహాచలం, తండ్రి తాడిశెట్టి ప్రసాదరావులను అదుపులోకి తీసుకున్నారు.

భేష్ !! రెండ్రోజుల్లోనే హత్య కేసును ఛేదించారు : డీఎస్పీ

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెంలో ఈనెల 10న జరిగిన హత్య కేసులో నిందితులను బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాస రావు మీడియా ముందు హాజరుపరిచారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే రామకృష్ణ హత్య జరిగిందన్నారు.

నిందితులు అరెస్ట్

తన భార్యతో రామకృష్ణ వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని నిందితుడు తాడిశెట్టి సింహాచలం, తన తండ్రి తాడిశెట్టి ప్రసాదరావు సహాయంతో దారుణ హత్యకు పాల్పడ్డారు. కర్ర, గొడ్డలి ఉపయోగించి హత్య చేసిన అనంతరం.. మృతదేహాన్ని బాధితుడి ఇంటి ముందు ఉంచి పరారయ్యారు. మండలంలోని గోళ్ల మూడిపాడులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన గ్రామీణ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి : దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్​'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.