ETV Bharat / crime

DRUGS: గంజాయి వినియోగమే కాదు సరఫరాలోనూ వారిదే కీలకపాత్ర - గంజాయి వినియోగమే కాదు సరఫరాలోనూ వారిదే కీలకపాత్ర

గంజాయి గుప్పుగుప్పుమంటోంది. విద్యార్థులు, జులాయిగా తిరిగే యువకులే వారి టార్గెట్. గంజాయి వినియోగమే కాదు సరఫరాలోనూ వారిదే కీలకపాత్ర అవుతోంది. ఇతర రాష్ట్రాలకూ మత్తెక్కిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం..

drugs
drugs
author img

By

Published : Oct 13, 2021, 7:03 AM IST

రాష్ట్రంలో గంజాయి గుప్పుగుప్పుమంటోంది. విద్యార్థులు, యువతను మత్తుకు అలవాటు చేస్తున్న ముఠాలు.. ఆనక వారిని ఈ దందాలోకి లాగుతున్నాయి. సరఫరాలోనూ కీలక పాత్రధారులుగా మార్చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు తదితర ప్రధాన నగరాల్లో గతంలో ఒకరో ఇద్దరో సరఫరాదారులు ఉండేవారు.

విద్యార్థులే ఆ అవతారమెత్తాక ఈ సంఖ్య వందల్లోకి వెళ్లిపోయిందంటే అతిశయోక్తి కాదు. వీరు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలకూ ఈ మత్తు ఎక్కిస్తున్నారు. అలా రవాణా చేస్తూ పోలీసులకూ దొరుకుతున్నారు.

ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతూ అల్లరిచిల్లరగా తిరిగే మద్యం, సిగరెట్‌ వంటివి తాగుతూ సులువుగా ప్రలోభాలకు ఆకర్షితులయ్యే విద్యార్థులను మాదకద్రవ్యాల ముఠాలు ఎంపిక చేసుకుంటున్నాయి. వారికి తొలుత చిన్న చిన్న పొట్లాల్లో ఉచితంగా గంజాయి ఇస్తూ ఊరిస్తున్నాయి. ఆ మత్తు లేనిదే ఉండలేరని నిర్ధారించుకున్న తర్వాత డబ్బులు వసూలు మొదలుపెడుతున్నాయి. దాన్ని కొనేందుకు విద్యార్థులకు డబ్బులు అవసరం కావటంతో మత్తు ముఠాలు వారిని నెమ్మదిగా ఉచ్చులోకి లాగుతున్నాయి. సరఫరాదారులుగా మారితే 20-30 శాతం కమీషన్‌ చెల్లిస్తామంటూ ఆశ చూపుతున్నాయి. దీంతో వారు మరింత మంది విద్యార్థులకు ఈ మత్తు అలవాటు చేస్తున్నారు. ఇంకొంతమంది విద్యార్థులైతే తమ జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం దీని అక్రమ రవాణాకు అలవాటుపడుతున్నారు. విద్యార్థులు, యువత భాగస్వామ్యం పెరిగినప్పటి నుంచే ఈ మత్తుపదార్థాల వినియోగమూ అధికమైంది.

సామాజిక మాధ్యమాల్లో ఆర్డర్లు!

గంజాయి సరఫరాదారులుగా అవతారమెత్తిన విద్యార్థులు, యువకులు వాటి విక్రయాల కోసం వాట్సప్‌, టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటున్నారు. వాటి ద్వారా సంప్రదించి ఆర్డరు ఇస్తే కావాల్సినచోటకు సరకు చేరుస్తున్నారు. కొందరైతే పాత వినియోగదారులు, పరిచయస్తులకు ఏకంగా ఇళ్లకే తీసుకెళ్లి అందజేస్తున్న ఉదంతాలు ఇటీవల విజయవాడలో వెలుగుచూశాయి. అనధికారికంగా రూపొందించుకున్న ప్రత్యేక కోడ్‌ ఆధారంగా ఈ లావాదేవీలు జరుపుతున్నారు. ఎవరైనా కొత్తవారు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా గంజాయి కోసం సంప్రదిస్తే మాత్రం తమకు అలాంటిదేమీ తెలియదని చెబుతున్నారు. పోలీసులకు, నిఘా సంస్థలకు చిక్కకుండా ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారు.

ఇచ్చి పుచ్చుకుంటున్నారు..

విశాఖ మన్యంలో పండిస్తున్న శీలావతి రకం గంజాయికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ కిలో రూ.3 వేలకు దొరికే గంజాయి ఇతర రాష్ట్రాలకు చేరేసరికి మూణ్నాలుగు రెట్లు అధిక ధర పలుకుతోంది. దీంతో కొంతమంది యువకులు దాన్ని గోవా, ముంబై, పుణె తదితర ప్రాంతాలకు పంపి.. ప్రతిగా అక్కడి నుంచి ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌, హెరాయిన్‌ తదితర మాదకద్రవ్యాలను ఏపీకి తెచ్చి ఇక్కడి వారికి అలవాటు చేస్తున్నారు. నైజీరియన్లతో చేతులు కలిపి ఈ దందా చేస్తున్నారు. మరికొందరు విద్యార్థులు గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బులతో డార్క్‌నెట్‌ ద్వారా ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల్ని తెప్పించుకుని వాటి వినియోగదారులుగా, సరఫరాదారులుగా మారుతున్నారు. ఈ వ్యవహారమంతా చాప కింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది.

మత్తు కోసం దొంగలవుతున్నారు..

విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత రెండేళ్లలో దాదాపు 200 మంది గంజాయి వాడే వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిలో 100 మందికి పైగా యువకులే. అందులోనూ ఇంజినీరింగ్‌, డిగ్రీ వంటివి మధ్యలోనే ఆపేసినవారే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది మైనర్లూ దీనికి అలవాటుపడ్డారు. దీనికి బాగా అలవాటుపడిన వారికి నిరంతరం ఆ మత్తు కావాల్సి ఉంటోంది. ఆ డబ్బుల కోసం కొందరు దొంగతనాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి.

చిన్న చిన్న దుకాణాలు అడ్డాలే

ప్రముఖ విద్యాసంస్థలకు సమీపంలోని కొన్ని కిళ్లీ కొట్లు, టీ దుకాణాలు గంజాయి విక్రయ కేంద్రాలుగా ఉంటున్నాయి. సిగరెట్ల ముసుగులో అమ్మకాలు సాగుతున్నాయి. గాంజా, పాటా, హస్‌, స్టఫ్‌, స్టాష్‌ ఇలా చాలా పేర్లతో వీటిని విక్రయిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు, యువకులు అనుమానం రాకుండా ద్విచక్రవాహనాలపై తిరుగుతూ తెలిసినవారికి అమ్ముతున్నారు. విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి విరివిగా లభిస్తోంది. గంజాయి పీల్చాక కళ్లు ఎర్రబడతాయి. దానికి అలవాటుపడ్డ చాలా మంది కళాశాల విద్యార్థులు కళ్ల ఎరుపు తెలియకుండా ఐడ్రాప్స్‌ దగ్గర పెట్టుకుని వాడుతున్నారు.

తరలిస్తూ దొరికారిలా..

* ఇటీవల తమిళనాడులోని విరుగంబక్కమ్‌లో గంజాయితో నలుగురు యువకులు పోలీసులకు దొరికారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులని, విశాఖ మన్యం నుంచి అక్కడికి గంజాయి తీసుకెళ్లి కళాశాలలో విక్రయిస్తుంటారని విచారణలో తేలింది.

* గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ద్విచక్రవాహనంపై 14 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తూ తెలంగాణ పోలీసులకు చిక్కారు.

* కృష్ణా జిల్లా మైలవరం వద్ద కొన్నాళ్ల కిందట నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికారు. నిత్యం ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి.

ఇదీ చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.