ETV Bharat / crime

Double Murder: నెల్లూరులో కలకలం.. ఇద్దరు దారుణహత్య - Double Murder

Double murder in Nellore: నెల్లూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు నగర ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. దంపతుల జంట హత్య మరవకముందే మరో దారుణం జరిగింది. టైలర్స్​ కాలనీలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు.

Nellore Murder
నెల్లూరు జిల్లాలో హత్య
author img

By

Published : Sep 11, 2022, 4:54 PM IST

Two persons Killed in Nellore: నెల్లూరులో గత నెలలో జరిగిన జంట హత్యలు నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఆ ఘటనను మరవకముందే మళ్లీ జంట హత్యలు కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ మండల డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో రమణారెడ్డి, శ్రీకాంత్​ అనే వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల వివరాల ప్రకారం.. రమణారెడ్డి, శ్రీకాంత్​లు టైలర్స్​ కాలనీ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అక్కడికి గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో వచ్చి.. రమణారెడ్డి, శ్రీకాంత్​లపై దాడి చేశాడు. అనంతరం కత్తితో ఇద్దరినీ కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న వేదాయపాలెం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతి చెందిన రమణారెడ్డి, శ్రీకాంత్​ల మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరో.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హంతకుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ జంట హత్యలు స్థానికులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.