ETV Bharat / crime

Live video: భక్తి విన్యాసంలో అపశృతి.. క్రేన్​పై వేలాడుతూ కిందపడ్డ భక్తుడు - nachikuppam Tamilnadu

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నాచికుప్పం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆడి క్రుత్తిక ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. శరీరానికి చువ్వలు గుచ్చుకుని క్రేన్​పై వేలాడుతూ మొక్కులు చెల్లించుకుంటుండగా ఓ భక్తుడు జారి కింద పడ్డాడు. అతనికి తీవ్రగాయాలయ్యాయి.

క్రేన్​పై వేలాడుతూ కిందపడ్డ భక్తుడు
క్రేన్​పై వేలాడుతూ కిందపడ్డ భక్తుడు
author img

By

Published : Aug 3, 2021, 7:02 PM IST

క్రేన్​పై వేలాడుతూ కిందపడ్డ భక్తుడు

సరిహద్దు రాష్ట్రం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నాచికుప్పం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆడి క్రుత్తిక ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శరీరానికి శూలాలు గుచ్చుకుని క్రేన్​కు వేలాడుతూ భక్తులు కావడి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదే క్రమంలో నలుగురు భక్తులు క్రేన్​పై వేలాడుతుండగా అందులో ఓ భక్తుడు జారి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న సహచర భక్తులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి:

MURDER: వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని.. భార్యను చంపిన భర్త

BENGAL TIGER: అలరిస్తున్న తెల్ల పులులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.