ETV Bharat / crime

CYBER CRIME : మీ ఫోన్ కు ఈ మెసేజ్ వస్తోందా? తెరిస్తే ఖతమే.. ఆ బ్యాంకు ఖాతాదారులే లక్ష్యం! - sbi under cyber crime

మీ బ్యాంకు ఖాతా కేవైసీ పూర్తికాలేదంటూ ఫోన్లు వస్తున్నాయా..? పాన్​ కార్డు నంబర్​ అప్​డేట్​ కాకపోతే.. యోనో యాప్​ బ్లాక్​ అవుతుందంటూ సందేశాలు వస్తున్నాయా..? అయితే.. మీరు మరింత భద్రంగా ఉండాల్సిందే. పొరపాటున వివరాలు సమర్పించారో.. ఖాతాలోని డబ్బులన్నీ సమర్పించేసుకున్నట్టే! ముఖ్యంగా.. ఒకే బ్యాంకు ఖాతాదారులను సైబర్​ మోసగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేశారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

CYBER CRIME
CYBER CRIME
author img

By

Published : Oct 7, 2021, 1:00 PM IST

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) అప్‌డేట్‌ కాలేదనో.. యోనో మొబైల్‌ యాప్‌ బ్లాక్‌ అవుతుందనో.. ఎస్‌బీఐ (State Bank of India) పేరిట వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక్క సైబరాబాద్‌లోనే 140 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.67.1 లక్షల మేర మోసపోయినట్లుగా వెల్లడించారు.

గాలం వేస్తారిలా..
''మీకు మేం సాయం చేస్తాం.. మీ బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. కింద ఇచ్చిన లింక్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయండి. లేకపోతే మీ ఖాతాను స్తంభించిపోతుంది." అంటూ హెచ్చరిస్తారు. లేదంటే.. ఎస్‌బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ ‘యోనో’ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. మెసేజ్ లేదా ఫోన్ చేసి.. ''కింద ఉన్న లింక్‌ను క్లిక్‌ చేసి, పాన్‌ కార్డు నంబర్‌ నమోదు చేసుకోండి. లేదంటే.. ఈరోజు రాత్రి నుంచి మీ యాప్‌ బ్లాక్‌ అవుతుంది.'' అని భయపెడతారు.

స్పందిస్తే ఖతమే..
ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్‌కు కాల్‌ చేయగానే అవతలివైపు వ్యక్తులు మీకు సాయం చేస్తామంటూ నమ్మబలుకుతారు. ఎనీ డెస్క్‌ యాప్‌, క్విక్‌ సపోర్ట్‌ యాప్‌, టీం వ్యూయర్‌ యాప్‌ తదితర రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెబుతారు. అనంతరం.. వాటి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకుంటారు. ఆ క్రమంలో మనం నమోదు చేసే బ్యాంక్‌ ఖాతా, ఓటీపీ, ఇతరత్రా వివరాలు తెలుసుకొని ఖాతాలను ఖాళీ చేస్తారు.

ఆ బ్యాంకు ఖాతాదారులే లక్ష్యం..
అయితే.. ఈ సైబర్ నేరగాళ్లు ఎస్‌బీఐ ఖాతాదారులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌లో ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయగానే ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ (నకిలీ) ఓపెన్‌ అవుతుండటంతో ఖాతాదారులకు మరింత నమ్మకం ఏర్పడుతోంది. ఇక్కడ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ తదితర వివరాలను నమోదు చేయమని అడుగుతున్నారు. అలా చేయగానే ‘లాగిన్‌ ఎర్రర్‌’ అని వస్తుంది. ఎక్కడో సాంకేతిక సమస్యల తలెత్తి ఉంటుందని ఖాతాదారులు భావిస్తారు. ఆ క్రమంలోనే సైబర్‌ కేటుగాళ్లు అక్కడ నమోదు చేసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ సాయంతో బ్యాంక్‌ ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు.

ఆ ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దు

'ఎస్‌బీఐ బ్యాంక్‌ పేరిట వచ్చే బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్ధు. లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్ధు. ఖాతా, ఓటీపీ, పిన్‌ ఇతరత్రా ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్ధు. అనుమానం వస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రందించాలి.'

- సామల వెంకట్‌రెడ్డి, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ

ఇదీచూడండి: పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.