ETV Bharat / crime

Cryptocurrency: జనాలకు ఓ ఛాన్స్ ఇస్తున్న సైబర్‌ నేరగాళ్లు! - క్రిప్టో కరెన్సీ వార్తలు

"అమాయకత్వంతో కొందరు.. అత్యాశతో దాదాపుగా అందరూ మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు.. అలాంటి వారికి ఓ ఛాన్స్ ఇచ్చాను." అంటాడు ఓ సినిమాలో విలన్. అచ్చం ఇదే మాదిరిగా.. సైబర్‌ నేరగాళ్లూ అత్యాశాపరులకు అవకాశాలిస్తున్నారు. వారి వలకు చిక్కి, అనేక మంది విలవిల్లాడుతున్నారు.

cyber-criminals-cheated-through-cryptocurrency-and-bit-coin
అత్యాశే పెట్టుబడిగా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు
author img

By

Published : Nov 7, 2021, 9:02 AM IST

అధిక లాభాలు అంటూ ఆశచూపుతారు.. ముందుగా పెట్టుబడులకు కొంత మొత్తం లాభాలు అందించి ఎరవేస్తారు. అది నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాక.. ముఖం చాటేస్తారు. క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్లతో కోటీశ్వరులు కావొచ్చంటూ.. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు.

సిట్టింగ్‌లోనే 33 లక్షలు..
హైదరాబాద్‌లో ఈ తరహాలో అనేక సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల పలు కేసులు నమోదు కాగా రాచకొండ పోలీసులు పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షల నగదు నిలుపుదల చేశారు. ఇటీవల 25 కేసులకు సంబంధించి నిందితుడిని తీసుకురాగా... ఒక్క సిట్టింగ్‌లోనే 33 లక్షలు చెల్లించాడని పోలీసులు తెలిపారు. అంటే వారి మోసాల వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

భారీ లాభాలొస్తాయని నమ్మించి..
ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో ప్రకటనలు ఇస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఎదుటి వ్యక్తులను నమ్మించడానికి పలు డొల్ల కంపెనీలను సృష్టిస్తున్నారు. అమాయకుల గుర్తింపు కార్డులు తీసుకొని వాళ్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. సిమ్ కార్డులు సైతం తీసుకుంటున్నారు. యాప్‌లు సృష్టించి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయని నమ్మిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ముందస్తు జాగ్రత్తగా వర్చువల్ నంబర్లతో ఫోన్లు చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులను నమ్మించేందుకు మొదట కొంత డబ్బులు లాభంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. అలా ముగ్గులోకి దింపి లక్షల్లో నగదు వసూలు చేశాక.. బిస్తరు చుట్టేస్తున్నారు. తక్కువ కాలంలో కోటీశ్వరులైపోదామనే ఆశతో ప్రజలు అలాంటి వారి వలకు చిక్కొద్దని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని ఫోన్‌కాల్స్‌, గుర్తింపు లేని యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి: మరో 'క్రిప్టో' మోసం.. కోట్ల రూపాయలతో సృష్టికర్తలు జంప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.