గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్.. ఏటీ అగ్రహారంలో పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు దిశా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్.. రమేశ్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం