Conflict between two factions: కృష్ణా జిల్లా నందిగామ మండలం రాఘవాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు గ్రామానికి రావడంతో.. మంచినీళ్లు రావట్లేదని ఒక వర్గం వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోయాక.. సర్పంచ్ సురేశ్ వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యే దృష్టికి మంచినీటి సమస్య ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయమై మాటా మాటా పెరగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Ragging in Medical College: వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి దుస్తులు విప్పించి మరీ...