కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో చెత్తవేసే విషయంలో మహిళల మధ్య జరిగిన గొడవ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మోరగుడి ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి అనే మహిళపై సుబ్బన్న, అతని భార్య దాడి చేశారు. ఇంటి ఎదురుగా చెత్త వేయవద్దని చెప్పడంతో ఈ ఘర్షణకు దారితీసింది. వీధిలోనే రాళ్లు, కర్రలతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు.
ఈ ఘటన వైరల్ కావడంతో.. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలను పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారు. బాధితురాలు లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు సుబ్బన్న, సుందరమ్మ దంపతులు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు జమ్మలమడుగు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.
ఇదీ చదవండి:
కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర ధరలు పెంపు.. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ దాడులు