GANG RAPE UPDATES : సందు దొరికితే చాలు.. స్మార్ట్‌ఫోన్ కావాల్సిందే. నిమిషం వృథా చేయకుండా నెట్టింట్లో గడపాల్సిందే. ఇంటర్నెట్ లేకపోతే ఇక బతకలేమనే పిల్లలు. పనుల్లో నిమగ్నమై కన్నెత్తిచూడని తల్లిదండ్రులు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక భూతాల్లో ఒకటిగా మారిన పోర్న్ వీడియోలు తెలియకుండా పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు తీగ లాగితే.. నెట్ కదిలింది. తెలిసీతెలియని ప్రాయంలో అశ్లీల వీడియోలకు అలవాటు పడి అందులో చేసినట్లుగా చేయాలని కలిగిన కోరిక కొన్ని జీవితాలను నాశనం చేసింది.
హయత్‌నగర్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే బాలుడు తన తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్ తీసుకుని అశ్లీల వీడియోలు చూస్తుండేవాడు. తనతో పాటు పదో తరగతి చదివే ఇద్దరితో పాటు.. తొమ్మిదో తరగతి చదివే మరో విద్యార్ధికి అశ్లీల వీడియోలు చూపిస్తూ ఉండేవాడు. పాఠశాల ముగియగానే ప్రతిరోజు ఎవరూ లేని చోటకు వెళ్లి ఆ వీడియోలు చూస్తుండేవారు. కొన్ని నెలలుగా ఇదే విధంగా కొనసాగుతుండగా.. అందులో ఉన్నట్లుగా తామూ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే పాఠశాలలో తమతో కలిసి చదువుకునే ఓ బాలికపై కన్నేశారు.
ప్రణాళిక ప్రకారం ఎవరూ లేని సమయంలో పుస్తకం పేరుతో ఆమె ఇంటికి వెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరైన మరో విద్యార్థి ఈ ఘోరాన్ని వీడియో తీశాడు. ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోలను అడ్డుపెట్టుకుని.. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోలు మరో బాలుడికి షేర్ చేయటంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన విద్యార్థులను చితకబాదిన స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు.
సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలు వివరాలు బహిర్గతం కావటంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక నివాసం, చదివే పాఠశాలకు సంబంధించిన వివరాలు బయటికి రావటానికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఇవీ చదవండి: