ACCIDENT: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నియోజకవర్గ భాజపా ఇంఛార్జ్ కృష్ణబాబు కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108లో గుడివాడ ఆసుపత్రికి తరలించారు. ఆటో ఢీకొనడంతో కారు కాలువలోకి వెళ్లింది. ప్రమాద సమయంలో కారులో కృష్ణ బాబు దంపతులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనపై పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: