ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ బలగాలు బూబీ ట్రాప్లను గుర్తించారు. పోలీసులపై దాడులే లక్ష్యంగానే మావోయిస్టులు వీటిని అమర్చినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో యాంటీ నక్సల్స్ బృందం, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇవి బయటపడ్డాయి.

భూమికి పది అడుగుల లోతులో కందకాలు తవ్వి దానిలో వెదురు బొంగుల్ని.. సూది మొన మాదిరిగా చెక్కి అమర్చారు. వాటిపై ఆకులు కప్పి ఉంచారు. వీటిని పోలీసు బలగాలు ధ్వంసం చేశాయి.

ఇదీ చూడండి: PAYYAVULA KESAV: ఆ సంక్షోభానికి ప్రధాన కారణం సీఎం జగనే: పయ్యావుల