ETV Bharat / crime

పాఠశాల నుంచి వెళ్తున్న.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం - బాలికపై అత్యాచారం

అభం శుభం తెలియని ఓ 15 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

rape
rape
author img

By

Published : Apr 5, 2022, 7:08 PM IST

Auto driver rapes 15-year-old girl: తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ 15 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాాచారానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే... మార్చి 31న సుమారు 15 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తోంది. ఆ బాలికకు పరిచయమున్న ఆటోడ్రైవర్(50) మాయమాటలు చెప్పి... ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఆ మరునాడు ఈ విషయాన్ని బాలిక స్నేహితులు టీచర్​కు చెప్పారు. ఆమె బాధిత బాలికను పిలిచి ఏం జరిగిందన్న విషయం తెలుసుకోగా.. ఆటోడ్రైవర్ తనపై అత్యాచారం చేసినట్లు టీచర్​కు బాలిక తెలిపింది.

విషయం తెలుసుకున్న పాఠశాల టీచర్​.. బాధిత బాలిక తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. కాగా వారు పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఏప్రిల్ 4వ తేదీన స్కూల్​ టీచర్​ బాధిత బాలికను పోలీసులకు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా.. చేయలేదని.. చెప్పింది. ఇలాగే వదిలేస్తే.. ఎంతో మంది బలవుతారని టీచర్ బాధిత తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆటోడ్రైవర్​పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దారి తప్పిన "గురువు".. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.