ETV Bharat / crime

Attempt To Murder: యువకుడిపై హత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమేనా..! - latest crime news in andhra pradesh

Attempt To Murder: వారిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ధైర్యం చేసి అమ్మాయి.. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పింది. అయితే తల్లిదండ్రులు దానికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఈ విషయాన్ని పెళ్లికొడుక్కి తెలిపింది. తర్వాత ఏం జరిగిందంటే.. !

Attempt To Murder
యువకుడిపై హత్యాయత్నం
author img

By

Published : Mar 22, 2022, 12:41 PM IST

Attempt To Murder: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నజీర్, ఓ యువతి మధ్య కొద్ది నెలలుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే ఆమె తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోలేదు. కావలికి చెందిన మరో వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి.. తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లికొడుకుకు చెప్పింది. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్​ జరిగింది.

మాట్లాడదామని నజీర్​ను ఓ దగ్గరకు పిలిపించారు. అతని వద్ద ఉన్న కాల్ రికార్డు, ఫోటోలు డిలీట్ చేయించారు. ఆ తర్వాత నజీర్ స్కూటీపై వెళ్తుండగా కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో నజీర్​కు తీవ్ర గాయాలు కాగా అతనిని ఆసుపత్రికి తరలించారు. నజీర్​ని కారుతో ఢీకొట్టిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ.. ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.