ETV Bharat / crime

కేరళలో పడవ ప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి - కేరళలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన వ్యక్తి మృతి

Telangana Tourist dies in Kerala: కేరళ రాష్ట్రంలోని పున్నమడ సరస్సులో హౌస్‌బోట్ మునిగి కామారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి (60) అనే పర్యాటకుడు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానికులు కాపాడినట్లు తెలిపారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ramachandrareddy
ramachandrareddy
author img

By

Published : Dec 29, 2022, 9:33 PM IST

Updated : Dec 29, 2022, 10:51 PM IST

Telangana Tourist dies in Kerala: కేరళ రాష్ట్రంలో పున్నమడ సరస్సులో హౌస్‌బోట్ మునిగిన ఘటనలో కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో నలుగురికి స్థానిక అలప్పుజా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి పర్యాటకులతో పాటుగా బోటు సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి (58) మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో మృతుడు రామచంద్రారెడ్డితో పాటుగా ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, బంధువులు నరేందర్, నరేష్, పడవ ఉద్యోగి సునందన్​లు పడవలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి టోల్ గేట్ వద్ద గల బోట్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన ఆర్కిడ్ హౌస్‌బోట్ సరస్సులో ప్రమాదవశాత్తు మునిగిపోయిందని పోలీసులు వెల్లడించారు.

వీరంతా బుధవారం పర్యటన ముగించుకుని రాత్రి పడవలో బస చేసినట్లు వెల్లడించారు. పడవ మునిగిపోవడాన్ని గమనించిన ఇతర బోట్ సిబ్బంది మిగతా నలుగురిని కాపాడరని వెల్లడించారు. ప్రమాదానికి పడవ అడుగున ఉన్న ప్లాంక్ విరిగిపోవడమే కారణమని.. అందువల్లే బోటులోకి నీరు చేరినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 29, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.