ETV Bharat / crime

OLDMAN YOGA ON WATER: నీటిపై వృద్ధుడి యోగాసనాలు.. ఆశ్చర్యపోతున్న చూపరులు! - ap news

old man yoga performance: ఏడు పదుల వయస్సులోనూ యోగాసనాలతో అబ్బురపరుస్తున్నారు ఆ పెద్దాయన. నీటిలో ఆసనాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కార్తిక మాసం సందర్భంగా చెరువులో ఆసనాలు వేస్తూనే దీపాలు వెలిగించి పరమశివుణ్ని స్మరించుకున్నారు.

an-old-man-performing-yoga-asanas-on-the-water-at-guntur-district
నీటిపై వృద్ధుడి యోగాసనాలు.. ఆశ్చర్యపోతున్న చూపరులు!
author img

By

Published : Dec 1, 2021, 12:05 PM IST

Updated : Dec 1, 2021, 2:28 PM IST

నీటిపై వృద్ధుడి యోగాసనాలు.. ఆశ్చర్యపోతున్న చూపరులు!

old man yoga performance: యోగాసనాల సాయంతో నీటిలో తేలియాడుతున్న ఈ పెద్దాయన పేరు అచ్యుతరామరాజు. వయస్సు 70 ఏళ్లు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురంలో నివాసం ఉంటున్నారు. అచ్యుతరామరాజుకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టే అలవాటు ఉండేది. కానీ ఐదేళ్ల క్రితం సయాటికా నొప్పి రావడంతో.. ఈత కొట్టడానికి ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వెనక్కి తిరిగి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నొప్పి తగ్గుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో.. నీటిలో యోగాసనాలు వేయడం గురించి తెలుసుకున్నారు. అలా ఈతతో పాటు ఆసనాలు అభ్యసించారు.

స్వగ్రామైన అలకాపురంలో చెరువు లేకపోవటంతో.. సమీపంలోని సంగుపాలెం కోడూరు గ్రామ చెరువులో అచ్యుతరామరాజు ఆసనాలు వేస్తున్నారు. ఇప్పుడు కార్తిక మాసం కావటంతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో.. చెరువులో ఆసనాలు వేస్తూనే దీపాలు వెలిగించి అందరినీ అశ్చర్యపరుస్తున్నారు.

నీటిలో ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు అచ్యుతరామరాజు చెబుతున్నారు. చక్కెర, రక్తపోటు వంటివి అదుపులో ఉన్నాయని అంటున్నారు. అచ్యుతరామరాజు విన్యాసాల్ని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన చేస్తున్న పనిని అభినందించారు.

ఇదీ చూడండి:

TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

Last Updated : Dec 1, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.