గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో తల్లీకుమార్తెలను పాశవికంగా నరికి చంపిన నిందితుడు శ్రీనివాస చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు గ్రామీణ ఏఎస్పీ మూర్తి తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ఆస్తి వివాదం నేపథ్యంలో నిందితుడు పిన్ని పద్మావతి, చెల్లెలు ప్రత్యూషలను హత్య చేసినట్లు వివరించారు.
నాగార్జుననగర్‌లో గత నెల 28న దారుణం హత్య జరిగింది. తల్లీకుమార్తెలను వారి బంధువు శ్రీనివాస చక్రవర్తి పాశవికంగా నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లీ కుమార్తె ఇంట్లోనే రక్తపుమడుగులోనే విగతజీవులుగా పడిపోయారు. ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమని ఏఎస్పీ మూర్తి వివరించారు.
'లక్ష్మీనారాయణ కుటుంబానికి, వారి పెదనాన్న మధుసూదనరావు కుటుంబాల మధ్య పొలం వివాదముంది. గుంటూరులో నివసిస్తున్న మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు శనివారం రాత్రి సత్తెనపల్లిలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో లక్ష్మీనారాయణ ఇంట్లో లేరు..కోపోద్రేకంతో పద్మావతి, లక్ష్మీప్రత్యూషలపై శ్రీనివాసరావు కత్తితో అమానుషంగా దాడి చేయడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశాం' -గుంటూరు గ్రామీణ ఏఎస్పీ మూర్తి
ఇదీ చదవండి: