ETV Bharat / crime

ప్రియుడు చెప్పాడని భర్తకు విషం ఇచ్చిన భార్య.. కట్​ చేస్తే సీన్​ రివర్స్​..! - Wife killed Husband

Wife killed Husband in Medchal : కాపురాలు కూలిపోయి.. పచ్చని కుటుంబాలు కటకటాల పాలవుతున్నాయి. సాఫీగా సాగే సంసారాలు సర్వనాశనమై, జీవితాలు సగంలోనే ముగుస్తున్నాయి. పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి బంధాలు మరుస్తున్నారు. కడదాకా తోడుండాల్సిన వారే కనికరం లేకుండా కడతేర్చుతున్నారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌ శివారులో వెలుగులోకి వచ్చిన ఈ తరహా ఘటన విస్మయానికి గురిచేస్తోంది.

Wife killed Husband in Medchal
Wife killed Husband in Medchal
author img

By

Published : Feb 9, 2023, 1:56 PM IST

నేను చెప్పినట్టు చేస్తావా.. చస్తావా..?

Wife killed Husband in Medchal : తెలంగాణలోని మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పరిధిలోని అవుషాపూర్‌కు చెందిన ఎస్​కే.మౌలానా ఈ నెల 6న మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువుకు దుబాయ్‌ వెళ్లిన మౌలానా రెండేళ్ల క్రితం తిరిగొచ్చి ఇక్కడే కూలీ పనిచేస్తున్నాడు. తనకు భార్య షానాబీతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. భర్త విదేశానికి వెళ్లిన సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో షానాబీ వివాహేతర బంధం సాగించింది.

మృతుడు ఎస్​కే.మౌలానా
మృతుడు ఎస్​కే.మౌలానా

Wife Poisoned Her Husband in Ghatkesar : దుబాయ్‌ నుంచి వచ్చిన భర్త తమ బంధానికి అడ్డుగా మారటంతో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నెల 5న మద్యం కొనుగోలుకు అతను తను భార్యను రూ.100 అడిగాడు. డబ్బులు లేవంటూ ఇంట్లో ఉన్న మద్యం సీసాను షానాబీ తెచ్చి ఇచ్చింది. తాగిన కొద్ది సేపటికే కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో హడావుడిగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది.

Ghatkesar murder case : అక్కడి నుంచి ఈ నెల 6న నాగారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ మౌలానా మృతి చెందాడు. శవానికి పోస్టుమార్టం వద్దని భార్య చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి గ్రామంలో విచారణ చేపట్టారు. వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో గుర్తు తెలియని విషం తాగటంతోనే మౌలానా చనిపోయినట్లు తేలింది.

మౌలానా మృతిపై అనుమానంతో పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి సూచన మేరకు మద్యంలో విషం కలిపి ఇచ్చినట్లు ఆమె ఒప్పుకుంది. చెప్పినట్లు చేయకపోతే తనను చంపేస్తానని ప్రియుడు బెదిరించాడని చెప్పింది. ఇప్పటికే నిందితురాలు షానాబీ పోలీసుల అదుపులో ఉండగా ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.