ETV Bharat / crime

బతుకు బండిని లాగిన చక్రమే.. ప్రాణం తీసింది!

Tractor Tyre Blast: ఇన్నాళ్లు ట్రాక్టర్ చక్రమే అతనికి భరోసానిచ్చి, జీవితంలో ఎదగడానికి సాయం చేసింది. చివరకు ఆ చక్రమే అతని ప్రాణాలు బలిగొంది. ఇప్పుడే టైరు రిపేరు చేయించుకు వస్తానని బయటకు వెళ్లిన భర్త.. కొద్దిసేపటికే విగతజీవిగా మారడడంతో ఆ ఇల్లాలి రోదన ఆకాశాన్నంటిెంది. ఉన్న ఇద్దరు పిల్లలూ చిన్నారులే కావడం.. ఇక నాన్న కళ్లముందు కనిపించడన్న సంగతి తెలియని వాళ్లు.. "అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావంటూ అడిగిన ప్రశ్న" అందరి మనసులనూ పిండేసింది! ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది.

Tractor Tyre Blast
బతుకు బండిని లాగిన చక్రమే.. కాలయముడిగా మారి ప్రాణం తీసింది
author img

By

Published : Mar 23, 2022, 2:03 PM IST

Tractor Tyre Blast: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్ణం గ్రామానికి చెందిన పాలూరి అప్పలనాయుడు ప్రమాదవశాత్తు టైరు పేలిన ఘటనలో మృతి చెందగా, తోలాపు గోవిందరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం అప్పరనాయుడు ట్రాక్టరు వెనక టైరు పంక్చరు కావడంతో.. గ్రామంలోనే పంక్షర్ షాపు నిర్వహిస్తున్న తోలాపు గోవిందరావు దుకాణం వద్దకు తీసుకెళ్లాడు.

ఇద్దరు కలిసి ట్రాక్టరు టైరు బోల్టులు విప్పుతున్న సమయంలో గాలి ఒత్తిడి ఎక్కువై ఉన్నట్టుండి టైరు పేలింది. ఆ విస్పోటనం తీవ్రతకు గాల్లోకి లేచిన వీరిద్దరూ పది అడుగుల దూరంలో ఉన్న గోడకు బలంగా తాకారు. దీంతో.. పాలూరి అప్పలనాయుడు, గోవిందరావులు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వీరిద్దరినీ కర్లాం పీహెచ్​సీకి తరలించి ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత.. చీపురుపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం తరలిస్తుండగా దారిలో అప్పలనాయుడు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గోవిందరావులు చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: Police help: మూడు నిండు ప్రాణాలను కాపాడిన పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.