తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం కనుసులులో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన సవలం గంగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుడు.. మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నాడు.
అనంతరం ఇంటికి వెళ్లి పడుకున్న అతనిపై దాడి జరిగింది. తలపై కొట్టి హత్య చేశారు. ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చింతూరు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: