కంటైనర్ డ్రైవర్ నిద్ర మత్తు వల్ల నిండు ప్రాణం బలిగొన్న ఘటన కడప జిల్లా సిద్ధవటం మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కంటైనర్ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది.
అదే.. సమయానికి రోడ్డు దాటుతున్న బాలగంగాధర్ రెడ్డి అనే వ్యక్తిని కంటైనర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ రోడ్డు మధ్యలో బోల్తాపడింది. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం పోలీసులు.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Prank Video Failed : ప్రాంక్ వీడియో కాస్తా.. ఫైట్ వీడియో అయింది!
సైబర్ నేరాలపై కేంద్రం సరికొత్త వ్యవస్థ.. 24 గంటలు పనిచేసేలా హెల్ప్‌లైన్ (155260)