కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె ప్రకాశ్‌నగర్ వద్ద కైపు వెంకటేశ్ (43) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. తల, మెడపై గొడ్డలితో అతనిపై కిరాతకంగా దాడి చేశారు. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య సమాచారం అందుకున్న సీఐ బీవీ చలపతి, ఎస్సై వెంకటరమణలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కైపు వెంకటేశ్ గురించి కుటుంబసభ్యులు, గ్రామస్థులతో ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: