![పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద 25 కిలోల వెండి స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:24:27:1619420067_ap-kn-01-26-silver-seiz-av-3068850_26042021120612_2604f_1619418972_919.jpeg)
కర్నూలు జిల్లాలో తెలంగాణ సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 25 కిలోల వెండిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో 25 కిలోల వెండి లభ్యమైంది. టీఎస్ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న తమిళనాడుకు చెందిన ఉదయకుమార్ అనే వ్యక్తి వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు