ETV Bharat / crime

Girl rescued from human trafficking: తల్లికాదు.. పిశాచి! కూతురిని బలవంతంగా.. - Girl rescued from human trafficking

Girl rescued from human trafficking: బలవంతంగా రొంపిలోకి దింపుతున్న తల్లి చెర నుంచి పదహారేళ్ల అమ్మాయిని హైదరాబాద్ చైల్డ్​లైన్​ ప్రతినిధులు కాపాడారు. బాధితురాలిని తమ రక్షణలోకి తీసుకుని విచారించగా.. మరిన్ని దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు సంస్థ ప్రతినిధులు వెంటనే ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగించి.. తల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Girl rescued from human trafficking
కన్నతల్లే కూతురిని బలవంతంగా అలా చేయిస్తుంటే
author img

By

Published : Dec 10, 2021, 5:52 PM IST

Girl rescued from human trafficking: చైల్డ్​ ట్రాఫికింగ్​కి పాల్పడుతున్న ఓ మహిళ నుంచి పదహారేళ్ల బాలికను హైదరాబాద్​ చైల్డ్​లైన్​ ప్రతినిధులు కాపాడారు. సదరు మహిళ.. బాధితురాలికి సొంత తల్లే కావటం గమనార్హం. బాలికను ఆమె చెర నుంచి కాపాడిన చైల్డ్​లైన్​ ప్రతినిధులు.. బంజారాహిల్స్​ పోలీసులకు అప్పగించారు. బాధితురాలితో ఆమె తల్లి బలవంతంగా భిక్షాటన చేయించటంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేస్తోందని చైల్డ్​లైన్​ కోఆర్డినేటర్​ సల్మాన్​రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad ChildLine: నవంబర్​ 28న చైల్డ్​లైన్​ కార్యాలయాని(1098)కి ఓ ఫోన్​కాల్​ వచ్చింది. హైదరాబాద్​ అమీర్​పేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో.. ఓ 16 ఏళ్ల వయసున్న అమ్మాయితో ఆమె తల్లి బలవంతంగా భిక్షాటన చేయిస్తోందని ఆ ఫోన్​ కాల్​ సారాంశం. ఆ ఫోన్​ వచ్చిన వెంటనే.. చైల్డ్​లైన్​ ప్రతినిధి ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. అక్కడి నుంచి బాలికతో పాటు ఆమె తల్లి పారారైంది. చుట్టుపక్కల వెతికినా దొరకలేదు.

16 years girl rescued: ఈ నెల 8న కూడా మళ్లీ ఓ ఫోన్​ వచ్చింది. ఖమ్మం బస్టాండ్​లో 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తోందని.. ఫోన్​ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఇదే తరహా ఫోన్​ 6 వ తేదీన కూడా రాగా.. అప్పుడు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అప్పటి నుంచి కొంత అప్రమత్తంగా ఉన్న చైల్డ్​లైన్​ ప్రతినిధులు.. 8న కాల్​ రాగానే హుటాహుటిన ఖమ్మం బస్టాండ్​కు చేరుకున్నారు. బాలికను గుర్తించి తమ రక్షణలోకి తీసుకున్నారు. అమ్మాయిని ఆరా తీయగా.. తన తల్లి భిక్షాటనతో పాటు తనపై అత్యాచారం చేయిస్తుందని ప్రతినిధులకు తెలిపింది. వెంటనే బాలికను హైదరాబాద్​కు తరలించారు. బంజారాహిల్స్​ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం వివరించారు. చైల్డ్​లైన్ ప్రతినిధుల ఫిర్యాదుతో.. బంజారాహిల్స్ ఇందిరానగర్​లో నివసించే తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

"ఆ అమ్మాయి చెప్పిన వివరాలు ప్రకారం.. అంతకుముందు అమీర్​పేటలో భిక్షాటన చేసిన అమ్మాయి కూడా తనేనని నిర్ధరించుకున్నాం. బాలికను లోతుగా విచారించగా.. తన తల్లి చైల్డ్​ ట్రాఫికింగ్​ చేస్తోందని.. తనను లైంగికంగా వేధిస్తోందని తెలిపింది. ఆమెతో బలవతంగా భిక్షాటన చేపిస్తోంది. బాధితురాలి తల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుని.. మరే అమ్మాయి బలికాకుండా కాపాడాలి." - సాల్మన్​రాజు, చైల్డ్​లైన్​ కో-ఆర్డినేటర్​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.