శ్రీకాకుళం జిల్లా కొత్తూరు-పారాపురానికి చెందిన కిలుగు మన్మథరావు అనే వ్యక్తి రావులపాలెం వెళ్తుండగా... బస్సు విశాఖ బస్టాండ్‌లో ఆగింది. మూత్రశాలకు వెళ్లేందుకు దిగాడు. ఆ సమయంలోనే ఓ ఇద్దరు ప్రయాణికులు బహిరంగంగానే మూత్రవిసర్జన చేశారు. అది చూసిన ఇతనూ అదే పని చేయబోయాడు. అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు తనను ఆపారని... జేబులో ఉన్న నగదు తీసుకొని అందరి ముందు కొట్టారని మన్మథరావు ఆరోపించాడు. ఈ ఘటనతో తీవ్రమనస్తాపానికి గురై బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రరక్త స్రావంతో ఉన్న మన్మథరావును హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. అత్యవసరవార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి :