ETV Bharat / city

Young man died while moving marijuana: గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి - పెందుర్తిలో బైక్ యాక్సిడెంట్

Young man died while moving marijuana: ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది.

Young man died while moving marijuana
గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి
author img

By

Published : Dec 16, 2021, 12:21 PM IST

Young man died while moving marijuana: విశాఖ జిల్లా పెందుర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ఆర్ వెంకటాపురం బీఆర్టీఎస్ రోడ్డులో గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పశ్చిమగోదావరికి చెందిన గోపి కృష్ణ (23), విశాఖపట్నానికి చెందిన వరుణ్ ఇద్దరూ కలిసి తమ ద్విచక్ర వాహనంపై అరకు నుంచి విశాఖపట్నం వస్తున్నారు. ఆ సమయంలో వీరు బైక్​లో గంజాయి తరలిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన గోపి కృష్ణ(23) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్​కి తరలించారు. వరుణ్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి :

COUPLE DIED: కుటుంబకలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. ఆ తరువాత తానూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.