మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 53, 54, 55, 42, 43, 44, 26, 25 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను బలపరుస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకువచ్చారు. మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, సామాజిక భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు తదితర సౌకర్యాలను సంబంధిత వార్డులో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రచార కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కే కే రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం: సుబ్బారెడ్డి