కొత్త సిట్ పరిధి విస్తరణ
విశాఖ భూముల వ్యవహారంలో గత సిట్ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా ఉందన్నారు. ఆ నివేదిక తెదేపా మంత్రులు, ప్రజాప్రతినిధులను రక్షించే విధంగా ఉందన్నారు. ఈ లోపాలను సరిచేసేందుకే మరో సిట్ వేసి, దాని పరిధిని విస్తరించి, సిట్‌కు సుమోటోగా విచారించే అధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. పవన్ చంద్రబాబుకి అమ్ముడుపోయాడా లేదా అన్నది ఆయనకే తెలుసునని విమర్శించారు.
తప్పు మార్గంలో భాజపా రాష్ట్ర నాయకత్వం
పవన్ చంద్రబాబుకి దత్తపుత్రుడన్న విజయసాయిరెడ్డి... ఒక సినిమా హీరోలా మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారని విమర్శించారు. ప్రభుత్వం చేసే ఏ పని అయినా విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పత్రికలకు ఉందన్న ఆయన..ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం తప్పు మార్గంలో పయనిస్తోందని...కేంద్ర నాయకత్వంపై తమకు ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కేటాయించిన అవసరానికి భూమిని వినియోగించకపోయినా, బోగస్ కంపెనీలకు కట్టబెట్టినా అటువంటి భూకేటాయింపులన్నీ రద్దు చేస్తామన్నారు.