ETV Bharat / city

IT Hub: 'ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్​గా ఏపీ'

టెక్ మార్క్ ఇండియా సౌజన్యంతో నవంబరు 18,19,20న విశాఖపట్నంలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కాంగ్రెస్ ఎక్స్​పో సదస్సును నిర్వహించనున్నట్లు మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఐటీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్​గా ఆంధ్రప్రదేశ్​ను తీర్చిదిద్దుతామన్నారు.

ycp ministers on New IT Education policy
ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్​గా ఏపీ
author img

By

Published : Jul 1, 2021, 8:17 PM IST

ఐటీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్​గా ఆంధ్రప్రదేశ్​ను తీర్చిదిద్దుతామని మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో విద్య, నైపుణ్య, ఐటీ రంగాలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. టెక్ మార్క్ ఇండియా సౌజన్యంతో నవంబరు 18,19,20న విశాఖపట్నంలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్​ కాంగ్రెస్ ఎక్స్​పో సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన బ్రోచర్​ను మంత్రులు విడుదల చేశారు.

కొవిడ్ సంక్షోభంలోనూ..దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఇప్పటికే లక్షలాది మందికి ఉద్యోగాలందించామని మంత్రి సురేశ్ అన్నారు. నిరుద్యోగులకు, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలందించడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో శ్రీకారం చుట్టిన నాడు-నేడు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా నాడు-నేడును ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతోందని గుర్తు చేశారు. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు చిరునామాగా ఏపీ నిలవనుందన్నారు.

మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు

ప్రపంచ స్థాయి నాలెడ్జ్​ని పంచుకుని, మరిన్ని ఆవిష్కరణలతో మరింత ముందుకు వెళ్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రెండేళ్ల కాలంలో విద్య నుంచి ఉపాధి వరకూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. కొవిడ్ వల్ల ఊహించని విధంగా టెక్నాలజీ ఆవశ్యకత పెరిగిందన్నారు. సాంకేతికతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్ ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నటికీ వన్నెతరగనిది, విలువ తగ్గనిది సాంకేతిక, విద్య, నైపుణ్యం మాత్రమేనని అన్నారు. విద్యకు, టెక్నాలజీ, నైపుణ్యం జోడించినపుడే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. మునుపటిలా ఇంటర్నెట్ అనేది ఏ కొందరికో కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని గౌతమ్ రెడ్డి అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల గమ్యస్థానంగా భావించి ఈ 'జీఎస్ యూఈ'ని విశాఖలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. నవంబర్ 18, 2021న విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్టార్టప్ కాంగ్రెస్ అండ్ ఎక్స్ పో (GSUE-2021)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.

ఆగస్టు 18న షెడ్యూలు

ఎక్స్ పోకి సంబంధించి ఆగస్టు 18న షెడ్యూలు విడుదల చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. మరిన్ని వివరాలకోసం GSUE.in వెబ్​సైట్​ను సంప్రదించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది టెక్నాలజీ, నైపుణ్యం, విద్య, స్టార్టప్, పారిశ్రామిక రంగాల నిపుణులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. వందలాది పరిశ్రమలు, కంపెనీల ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఎక్స్​పో జరగుతుందన్నారు. విద్య, సాంకేతిక, నైపుణ్యరంగాల నిష్ణాతులు వారి నూతన ఆలోచనలను పంచుకోవడమే లక్ష్యంగా ఎక్స్ పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నియమ, నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో వర్చువల్​గానూ హాజరయ్యే వెసులుబాటు కల్పించామన్నారు. ముఖాముఖి కార్యక్రమాలు, ప్రొడక్ట్ డెమోలు, వర్చువల్ షో రూమ్​లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రేడ్ షోలకు జీఎస్ యూఈ-2021లో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఆత్మనిర్భర్ లక్ష్యాలను అందుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంటర్నెట్ ఒకప్పుడు ప్రత్యేక హోదా వంటిదని..,ఇప్పుడు ప్రాథమిక హక్కుని నిర్వహకులు తెలిపారు.

ఇదీచదవండి

Drugs Case: సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.