కరోనా నివారణ చర్యల్లో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్తో నివాసాలకే పరిమితమైన వారికి ఇళ్ల వద్దే సాయమందించేందుకు పలు రాజకీయ కార్యకర్తలు నేతలు ముందుకు వస్తున్నారు. విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలో సేవాభావంతో ఈ తరహా సహాయం అందిస్తున్న వారిని అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు నేతలు గుంపులు గుంపులుగా వెళ్లి సాయాన్ని అందిస్తూనే తమకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటెయ్యాలని ప్రచారం చేయడం అందరినీ విస్మయపరుస్తుంది. ఈ చర్యలకు అడ్డుకట్ట వెయ్యకపోతే కరోనా ప్రబలేందుకు ఇదో కారణం అయ్యే ప్రమాదముందని స్థానికుల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: