ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీలు రంగులు ప్రతిబింబించేలా వేసినా వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 623 రద్దు చేసింది. అయినా రంగులు వేస్తేూనే ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయం పై భాగంలోని రైతు భరోసా కేంద్రానికి మూడు రోజులుగా రంగులద్దుతున్నారు. వేసిన రంగులు తీసేయాలని కోర్టు చెబుతున్నా శనివారం కార్మికులు వేశారు.
విశాఖలోనూ అదే సీన్...
విశాఖ జిల్లా కోటవురట్ల మండలం పాములవాక పంచాయతీ కార్యాలయంలో ఓ గదికి వైకాపా జెండాను పోలిన రంగులను వేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి నాయుడిని వివరణ కోరగా..ఆ గదిని రైత భరోసా కేంద్రానికి అప్పగించామని తెలిపారు. వ్యవసాయాధికారి ఏఓ సోమశేఖర్‌ను ప్రశ్నించగా..ప్రభుత్వ ఆదేశాల మేరకే రంగులు వేయిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: