ETV Bharat / city

ఉన్న వారికే పనిలేదు... అయినా జోరుగా నియామకాలు!

author img

By

Published : Oct 29, 2020, 10:50 PM IST

విశాఖపట్నం మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో ఇష్టానుసారం ఉన్నతాధికారులు నియామకాలు చేపడుతున్నారని ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డిప్యుటేషన్‌ కింద తీసుకుంటున్న వారి ఎంపికలో ఎటువంటి నిబంధనలు పాటించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

vmrda
vmrda

విశాఖపట్నం మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు డిప్యుటేషన్‌ కింద పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్లకే పని లేకపోవడం, అదనంగా మరికొందరి నియామకాలపై ఉద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డిప్యుటేషన్‌ కింద తీసుకుంటున్న వారి ఎంపికలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టౌన్‌ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాల డీఈ, ఏపీవో, జేపీవోలు వీఎంఆర్‌డీఏలోని ప్లానింగ్, ఇంజినీరింగ్‌లో పనిచేసేందుకు కొత్తవారు వస్తున్నారు. తాజాగా టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరక్టర్‌ ప్రస్తుతం అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో పనిచేస్తున్న కె.సంజయ్‌ రత్నకుమార్‌ ఏడాది కాలానికి డిప్యుటేషన్‌ కింద వీఎంఆర్‌డీఏకు వచ్చారు. అలాగే ప్రజారోగ్య విభాగానికి చెందిన కేవీ మాధవరావు డీఈఈగా డిప్యుటేషన్ కింద వచ్చేందుకు దరఖాస్తు చేశారు. అటవీ విభాగంలో ఎఫ్‌ఆర్‌వోగా సుజాత శివాని అనే ఉద్యోగి డిప్యుటేషన్‌ కింద చేరారు. ప్లానింగ్‌ విభాగంలో అవసరం లేనప్పటికీ రెండు వారాల కిందట టౌన్‌ప్లానింగ్‌ నుంచి ఇద్దరు ఏపీవోలు, ఒక జేపీవోను డిప్యుటేషన్‌ కింద తీసుకున్నారు. మనీష్‌ త్రిపాఠి, వైవి రమణలను ప్లానింగ్‌లో ఏపీవోలుగా నియమించారు. జేపీవోగా వచ్చిన చామంతి అనే ఉద్యోగికి ఏపీవో ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల కిందట కార్తిక అనే ఉద్యోగిని ఇంజినీరింగ్‌లో డీఈఈగా తీసుకున్నారు.

మరికొందరికి అనుమతి?

వీఎంఆర్‌డీఏలో ఏవోలుగా వచ్చేందుకు ఒక తహశీల్దార్, ఒక సచివాలయ సెక్షన్‌ అధికారి దరఖాస్తు చేసుకోగా వారికి అనుమతిచ్చారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ ఈఈ సోమశేఖర్‌ ఉన్నప్పటికీ మరొకరు దరఖాస్తు చేసుకోగా ఆయన నియామకానికి, అలాగే అకౌంట్స్‌ అధికారిగా పెట్టుకున్న ఒక ఉద్యోగినికి అనుమతించారు. వీరే కాకుండా ఎఫ్‌ఆర్‌వో, ఏఈఈ, డీఈఈలుగా వచ్చేందుకు మరో అయిదారుగురు వీఎంఆర్‌డీకు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగంలో డిప్యుటేషన్‌ మీదొచ్చి ఏపీవోలుగా విధులు నిర్వహిస్తున్న వి.శోభన్ బాబు, కె.పద్మజలకు ప్లానింగ్‌ అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వీఎంఆర్‌డీఏ అధికారులు ఉత్తర్వులిచ్చారు. వీఎంఆర్‌డీఏలో ఖాళీ చూపించి ఎఫ్‌ఏసీ ఇవ్వడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అడహాక్‌ ప్రమోషన్‌ మీద వచ్చిన వారికి డీఈ వేతనం ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమంటున్నారు. ఇటీవల వచ్చిన వాళ్లు కాకుండా మరో 28 మంది పలు విభాగాల్లో డిప్యుటేషన్‌ కింద ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో అదనంగా నియమించుకోవడం వల్ల వీఎంఆర్‌డీఏపై మరింత ఆర్థిక భారం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.