Woman Complaint: తాను బతికుండగానే చనిపోయినట్టు ద్రువీకరించి, తన భర్త కష్టార్జితంగా వచ్చిన ఆస్తిని పెంచుకున్న కుమారుడు కాజేశారని విశాఖలో 82 ఏళ్ళ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. కాన్సర్ వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నా తన ప్రమేయం లేకుండా ఉన్న మీసాల శంకరరావు, మీసాల వెంకట్రాజు అనే వ్యక్తులు ఆస్తిని కాజేశారని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని మొర పెట్టుకున్నారు.
విశాఖలో సూర్యభాగ్‌లో 82 ఏళ్ల తులసి నివాసం ఉంటుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో చెల్లెలు కుమారుడు మీసాల శంకరరావుని పెంచుకుంటూ జీవన సాగించింది. అయితే ఆ పెంచుకున్న కొడుకే బ్రతికుండగానే తులసి చనిపోయిందని ఆధారాలను సృష్టించి 96 గజాల స్థలాన్ని కాజేసి, ఆమెను ఇంటి నుంచి తరిమేశాడని వాపోయారు.
ఇది చదవండి:
శాసనసభలో దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్... చర్చకు పట్టుపట్టిన వైకాపా