తన ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు, మంచి నీరు, రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ భవనాల సౌకర్యం కల్పిస్తామని రాజ్యసభ సభ్యులు, వైకాపా కీలక నేత విజయసాయిరెడ్డి విశాఖ సీతమ్మధార ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖలోని పలు వార్డుల్లో విజయసాయి పర్యటించారు. సీతమ్మధార మురికివాడల్లో తిరిగారు.
స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరం సీతమ్మధారలోని మురికివాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు మసీదు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలు మార్చి 15 తరువాత ఇప్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు